epaper
Monday, March 2, 2026
epaper

ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు

ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు
మైసమ్మ ఆలయ కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం
అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలి: గంట రవికుమార్

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం మైసమ్మ ఆలయాన్ని పరిశీలించిన గంట రవికుమార్, స్థానిక గ్రామస్తులు, భక్తులతో మాట్లాడి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆలయ కూల్చివేతలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ నిధులతోనే ఆలయాన్ని పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని అధికారులు హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే కఠినంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసుల సహాయంతో ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. రోడ్డుపక్కన ఉన్నా, లేఅవుట్ పరిధిలో ఉన్నా కుట్రపూరితంగా ఆలయాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఓరుగల్లులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఒక మతానికి మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలు కనిపించవా?

గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకో అక్రమ నిర్మాణం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, నాలాల కబ్జాలు, రోడ్లపై నిర్మాణాలు జరుగుతున్నా అవి కార్పొరేషన్ అధికారులకు కనిపించడం లేదా అంటూ గంట రవికుమార్ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారా అని మండిపడ్డారు. అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, పైడిపెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img