epaper
Tuesday, March 10, 2026
epaper

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు
కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌
పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆదేశాలు
అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి
ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత అధికారులదే
ఆహార భద్రత కమిటీలు ముందుగా రుచి చూసి వడ్డించాలి
నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రాహుల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీవోలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు ఇంటి నుంచి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారం అందేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ చందుర్తి మండలం మర్రిగడ్డ...

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..! శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం...

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు కాకతీయ, కారేపల్లి: మండలంలో ప్రజా పాలన తొంభై తొమ్మిది...

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన...

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img