కాకతీయ, ఆత్మకూరు: ఇటీవలే ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ ఎన్,ఎస్,ఆర్ హోటల్ ఎదురుగా జరిగిన ఆక్సిడెంట్ లో ఇద్దరు మరణించగా శనివారం ఆత్మకూరు సిఐ సంతోష్ తో కలిసి రోడ్డు సేఫ్టీ సిఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐ బృందం, పరకాల డిపో మేనేజర్ తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగిందని సిఐ తెలిపారు.
అనంతరం సిఐ మాట్లాడుతూ జాతీయ రహదారి సిగ్నెల్ పాయింట్ లేకనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం జాతీయ రహదారి (163) ఏఈఈ మరియు ఈఈలకు వ్రాత పూర్వకంగా అభ్యర్థన లేఖ వ్రాసి వారికీ ఇచ్చామని సిఐ సంతోష్ తెలిపారు. వీరితోపాటు జాతీయ రహదారి (163) బృందం, పరకాల డిపో మేనేజర్, ఎన్ఎస్ఆర్ హోటల్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు..


