కాంగ్రెస్ అభ్యర్థి భర్త తిట్టని కులాలు లేవు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భర్త గతంలో సర్పంచ్ పదవిలో ఉండి అతను తిట్టని కులాలు లేవని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రములో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాపని రూపాదేవి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మల్లి ఏ ముఖం పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఎన్ని నెరవేర్చారని ఆత్మకూరు ప్రజలు కాంగ్రెస్ నాయకులు ఓట్లకోరకు వస్తే నిలదీయాలని అన్నారు. ఆత్మకూరు మాజీ సర్పంచ్ గ్రామంలోని యువతకు చెడు అలవాట్లు నేర్పిస్తూ యూవతను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్లీ గెలిస్తే అన్ని కులాల వారిని తిట్టడం మొదలు పెడతారని ఇలాంటి అభ్యర్థులను సిగ్గు షరం ఉంటేనే ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు. గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు పోసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. గ్రామంలో గృహ లక్ష్మి కింద ఇళ్లు వచ్చిన వారికి బిల్లులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ నత్తి సుధాకర్,బిఆర్ఎస్ నాయకులు వంగల బుచ్చిరెడ్డి, భగవాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


