మొబైల్ షాప్లో చోరీ
రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ
* పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఘటన
కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న భాస్కర్ మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి యజమాని మొబైల్ షాపును మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా సెల్ఫోన్స్, మిగతా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడానికి గమనించగా గుర్తు తెలియని వ్యక్తులు షాపుకి పెద్ద కన్నం వేసి దుండగులు లోనికి దూరినట్లు గుర్తించారు. విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. యజమాని ఫిర్యాదుతో ఎస్సై అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ,40,400 విలువజేసే మొబైల్స్ చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు.ఇది లా ఉండగా చేర్యాల పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే చోరీ జరగడం విస్మయానికి గురిచేస్తున్నది.ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీస్ అధికారులు కేసును ఛేదించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.



