కాకతీయ, దుగ్గొండి: మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గౌడ కుల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసుకున్న 4 గుడి గంటలను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి అపహారించారు.
దొంగతనం విషయమై గౌడ సంఘ పెద్దమనిషిని గుండెబోయిన రమేష్ గౌడ్, కార్యదర్శి కందుల శ్రీనివాస్ లను వివరణ కోరగా మంగళవారం ఉదయం గుడి శుభ్రం చేయుటకు వెళ్లగా దేవాలయంలో ఉండవలసిన నాలుగు గంటలు కనిపించలేదని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలిపారు. నాలుగు గుడిగంటల విలువ సుమారు.15 వేల పైబడి ఉంటాయని ఇట్టి విషయమై స్టానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


