కొత్తగట్టు ప్రైమరీ పాఠశాలలో చోరీ
కాకతీయ, శంకరపట్నం : మండలంలోని కొత్తగట్టు గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ వెల్లడించారు. పాఠశాలకు ఉదయం చేరుకున్న సమయంలో గది తాళం పగులగొట్టబడినట్లు గుర్తించిన ఆయన, లోపలికి వెళ్లి పరిశీలించగా వంటశాలకు సంబంధించిన రెండు గ్యాస్ సిలిండర్లు మరియు ఇతర వంట సామగ్రి ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


