కాకతీయ, పెద్దవంగర : కుక్కలంటే కొంతమందికి కరుస్తుందనే భయం ఉంటుంది. అలాంటిది ఓ యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నశునకాన్ని సపర్యాలు చేసి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం మెరుగైన చికిత్సకు పశువైద్యాధికారి వంకాడోత్ అనిల్ సహాయంతో ప్రాణాలు నిలబెట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి శివారులోని ఎనేమిది తండాలో ఓ శునకం విషపు పదార్థాలు తిని రోడ్డుకు అడ్డం పడిపోగా అటుగా వెళుతున్న అదే గ్రామానికి చెందిన బానోత్ రాంచరణ్ ఆగి పరిస్థితిని పరీక్షిస్తూ చలించిపోయి వివిధ రకాలుగా సపర్యలు (సిపిఆర్) చేశారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ అనిల్ కు సమాచారం అందించి శునకానికి చికిత్స చేయించి ప్రాణాలు నిలబెట్టాడు.


