*కాంగ్రేస్ పాలనా ప్రగతి రథ చక్రాలు*
రెండేళ్లలో అభివృద్ధి చేసాం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం
జోరుగా హుషారుగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పొన్నం ప్రచారం
ఆటో నడిపిన పొన్నం
ఫుల్ జోష్ లో నాయకులు కార్యకర్తలు.
కాకతీయ,హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఐదోవా వార్డ్ ఆరు ఏడోవా వార్డుల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులు బోలిశెట్టి రాజు, భూక్యా సంపత్ నాయక్, చిత్తరీ పద్మ తరుపున ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సహన్ని నింపారు. ఇందిరమ్మా ఇళ్ల లబ్ది దారులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరికరణ జరుగుతుంది అని పట్టణం లో అన్ని చౌరస్థలు అభివృద్ధి జరిగితుంది అని తెలియజేసారు. హుస్నాబాద్ పట్టణాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దితనని పని చేసే వారికీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేసారు. భారీ వర్షలు పడినప్పుడు షాపులల్లో కి నీరు రాకుండా కార్యక్రమలు చేపడుతాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి. డ్రైనేజీ సమస్యలు రోడ్ల సమస్య లు తీరుస్తాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో, కేడం లింగమూర్తి బోలిశెట్టి శివయ్య కర్ణకంటి మంజుల రెడ్డి, పలు వార్డుల అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



