పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్
కాకతీయ, తొర్రూరు : పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ స్పష్టం చేశారు.ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం నేతలు మాట్లాడుతూ.. పరాయి పాలన బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం పుట్టిన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు.
పేదలకు నష్టం చేసే విధానాలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి లభించిందని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఉపాధి హామీ విధానం పేదలకు నష్టం చేసేలా ఉందని విమర్శించారు. పేదల కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండి పోరాడిందన్నారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని, అది ఎప్పటికీ నశించదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల అనిత బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, వివిధ గ్రామాల సర్పంచులు బానోత్ శీను, బంగారు రమేష్, భానోత్ బిక్షపతి, గుండాల నరసయ్య, చిత్తలూరి శ్రీనివాస్, మంగళపల్లి రామచంద్రయ్య, గూడెల్లి రామచంద్రయ్య, దొంగరి శంకర్, రాజేష్ యాదవ్, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


