ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియు టిఎస్ లక్షంగా పనిచేస్తుంది.
కాకతీయ, పెద్దవంగర: ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియు టిఎస్ లక్షంగా పనిచేస్తుందని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మిర్యాల సతీష్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని కిస్టు తండా ప్రాథమిక పాఠశాలలో మండల అధ్యక్షులు గంగిశెట్టి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యకూబ్ పాషాను ఏక గ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చాగార్ల ముడి శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య, అంజయ్య,విద్యా సాగర్, బాలరాజు, వేణుమాధవ్, వెంకట శ్రీనివాస్ రావు, రవి,కవిరాజు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సురేష్, ప్రదీప్,వాణి, సువర్ణ,మహబూబీ, రామ తార తదితరులు పాల్గొన్నారు.


