కాకతీయ, ఆత్మకూరు: సొసైటీ చైర్మన్లు అవినీతికి పాల్పడితే సహించేది లేదని, అది కాంగ్రెస్ పార్టీ వారయినా వదిలేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడారు. సొసైటీలో చైర్మన్లు అవినీతికి పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని అన్నారు.
ఊరుగొండ పీఏసీఎస్ చైర్మన్ సొసైటీని అప్పులపాలు చేసారని పాలకవర్గమే నిలదీసి చైర్మన్ పదవి నుంచి తొలగించారని తెలిపారు. సొసైటీలో లెక్కలు తీయడానికి ఊరుగొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రావాలని, మరో వైపు డైరెక్టర్లు ఉంటారని, కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూడలేకనే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ పై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


