రైతుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
కాకతీయ,ఆత్మకూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూర్ మండలంలోని గూడెప్పాడ్ మార్కెట్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు కనీస మద్దతు ధరగా రూ 2400 చెల్లిస్తు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు నిరంతరం కొనసాగించాలని, మార్కెట్ యార్డులో రైతులకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.సన్న వడ్లకు రూ 500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా, ఏకకాలంలో రెండు లక్షల లో రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికపరంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి,గూడెప్పాడ్ సర్పంచ్ పరికి రమేష్ బాబు,మండల మాజీ అధ్యక్షుడు కమలాపురం రమేష్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు,అలువాల రవి,రేవూరి జైపాల్ రెడ్డి,ఏరుకొండ రవీందర్ గౌడ్,బోరిగాం స్వామి తదితరులు పాల్గొన్నారు.


