అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పరకాల, నడికూడ, మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 27 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి వరంగా మారిందని అన్నారు.పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని అన్నారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె. సుష్మ ఆధ్వర్యంలో కుంకుమేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో మునిసిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్ కుమార్, బుర్ర దేవేందర్ గౌడ్, మలహల్ రావు, తదితరులు పాల్గొన్నారు.


