వెబ్‌సైట్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలి
మాస్టర్ ప్లాన్ కేఎంఎల్ ఫైల్ అందుబాటులోకి తేవాలి
ల్ఆర్ఎస్ కట్‌ఆఫ్ తేదీ పొడిగింపు డిమాండ్
జీడబ్ల్యూఎంసీ ఎల్‌టీపీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్
కాకతీయ, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ పరిధిలో మాస్టర్ ప్లాన్, ఎల్ఆర్ఎస్ కట్‌ఆఫ్ తేదీ, డీపీఎంఎస్ వెబ్‌సైట్‌కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని లైసెన్స్ పొందిన సాంకేతిక వ్యక్తులు (ఎల్‌టీపీలు) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్‌టీపీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల జగదీశ్వర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కేఎంఎల్ ఫైల్‌ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎల్‌టీపీలు, పౌరులకు అందుబాటులోకి తేవాలని కోరారు. భూ వినియోగ మండలాలు, రోడ్డు వెడల్పుల తనిఖీలో స్పష్టత లభించి, భవన అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
ఎల్ఆర్ఎస్, డీపీఎంఎస్ సమస్యలు
2020 ఆగస్టు 26కు ముందు నమోదైన డాక్యుమెంట్లకే అనుమతులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేసి భవన అనుమతులు మంజూరు చేస్తూ కట్‌ఆఫ్ తేదీని డిసెంబర్ 2025 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే డీపీఎంఎస్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఆమోదిత ప్లాన్‌లు, ప్రొసీడింగ్స్ డౌన్‌లోడ్ కావడం లేదని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అనంతరం తనఖా డీడ్‌ల జారీలోనూ జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.


