అడ్డంకులు సృష్టించిన విజయం మాదే
కాకతీయ, రామకృష్ణాపూర్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించి, ఎన్నికను రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ విజయం సాధించామని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శనివారం చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నిక పూర్తయిన వెంటనే ఆయన స్వగృహంలో ఇంచార్జ్ గంగుల కమలాకర్,కోవా లక్ష్మీ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వాన్ని,అధికారులను అడ్డుపెట్టుకొని మంత్రి వివేక్ ఎన్ని కుట్రలు చేసిన క్యాతన్ పల్లిలో చివరికి న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. క్యాతన్ పల్లి అభివృద్ధికి మంత్రి రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న జీవో నెంబర్ 76 పట్టాలను ఇవ్వాలని,సింగరేణి వారసత్వ ఉద్యోగాలను,మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజా సమస్యలు,అభివృద్ధికై కొట్లాడుతామని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి కక్ష్య సాధింపు రాజకీయాలను పక్కన పెట్టీ మున్సిపాలిటీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని తెలిపారు. ఇంకా రెండు సార్లు నన్ను జైలుకు పంపిన నేను మంత్రికి ఐ లవ్ యూ చెప్తానన్నారు. గెలిచిన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలుపాలని కోరారు.


