- కుంభవృష్టితో కుదేలవుతున్న రైతన్నకు గుదిబండగా మారిన తనిఖీలు
- చెక్ పోస్టు సిబ్బంది చేతి వాటంతో తిప్పలు
కాకతీయ, బయ్యారం : ఆరుగాలం శ్రమించి కష్టపడి పని చేసిన రైతుకు వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. మంగళవారం ఇల్లందు నుంచి బయ్యారం వస్తున్న పత్తి లోడ్ వేసుకుని వస్తున్న వాహనాలను బయ్యారం చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాహనానికి వేయి నుంచి రెండువేల వరకూ చెస్ కట్టాలంటూ వాహనాలను నిలిపివేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ దోపిడీ చేస్తున్నట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు నేరుగా పత్తిని మిల్లులకు తీసుకొని వెళ్ళిన తర్వాత మాచర్ పేరుతో మిల్లు వారు పత్తిని రిజెక్ట్ చేస్తే రైతులు చెస్ కట్టి నష్టాల పాలవుతున్నట్లు గంధం పల్లికి చెందిన రైతు జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బయ్యారం చెక్ పోస్టు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.


