కాకతీయ, తెలంగాణ బ్యూరో: సృష్టి ఫెర్టిలిటీ స్కాము కేసేలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెట్ కు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్ కు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సృష్టికేసులో 8 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించినట్లు చెప్పుకొచ్చారు. మరో కేసులో రూ. 15లక్షలు ఎక్కువగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని డీసీపీ తెలిపారు.
విశాఖలో కూడా సరోగసీ పేరుతో మోసం చేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు ఇచ్చిన బేబీగర్ల్ కు డీఎన్ఏ టెస్టు చేసి సరి పోల్చినప్పుడు ఈ వ్యవహారం బయటపడినట్లు వెల్లడించారు. ఈ కేసులో చాలా మంది వైద్యుల ప్రమేయం ఉందని తెలిపారు. విశాఖలో డాక్టర్లు విద్యులత, రవిని అరెస్టు చేశామని తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 25మంది అరెస్టు చేసినట్లు తెలిపారు.


