epaper
Thursday, March 5, 2026
epaper

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం
భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
గురుకులంలో ఆకస్మిక తనిఖీ
నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం

కాకతీయ, ఖమ్మం : విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ మౌలిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు తదితర సరుకులను పరిశీలించి రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కామన్ మెనూ ప్రకారం వండుతున్న అన్నం, కూరలను కూడా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెస్ కమిటీ వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని, కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తరువాత పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు మరో 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనం ఎంతసేపు చదువుతున్నామన్నదికంటే ఎంత శ్రద్ధగా చదువుతున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షలకు బాగా సిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి ప్రధాన పరీక్షలకు ముందు ఎక్కువగా ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కువగా పరీక్షలు రాయడం వల్ల తుది పరీక్షల్లో ఒత్తిడి తగ్గి సులభంగా రాయగలమన్నారు. చదివిన దానికంటే రాసిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయని చెప్పారు. ఒత్తిడిని తగ్గించేందుకు శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్ర లేకుండా ఉండకూడదని, ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని తెలిపారు. బయట ఆహారం తీసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుపై నమ్మకం ఉంచుకుని పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు నెల రోజుల పాటు జరుగుతాయని, ఏకాగ్రతతో సిద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస కాంగ్రెస్ పార్టీలో...

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి భ‌ద్రాద్రి...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల...

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రేషన్ డీలర్‌పై కేసు నమోదు తనిఖీలో 60 క్వింటాళ్లకు పైగా నిల్వ తేడా...

మార్చి 16న చలో కలెక్టరేట్

మార్చి 16న చలో కలెక్టరేట్ లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి కార్మికుల...

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు రెండు లక్షల జరిమానా...

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై...

ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి

ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర‌స‌న‌ ఖ‌మ్మంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img