epaper
Thursday, January 15, 2026
epaper

వీడిన స‌స్పెన్స్‌.. అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం!

వీడిన స‌స్పెన్స్‌.. అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం!
స్మృతి–పలాశ్ వివాహం వాయిదాపై రూమర్ల తుఫాన్
అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతున్న‌ టెన్షన్
గుడ్‌న్యూస్ పంచుకున్న పలాశ్ తల్లి అమిత ముచ్చల్

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెట్‌లో ఆధిపత్యం చాటుతున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహంపై నెలకొన్న స‌స్పెన్స్ ఇప్పుడు వీడిన‌ట్లే కనిపిస్తోంది. ఎన్నో రూమర్లు, అనుమానాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు.. ఈ అన్నింటి మధ్య‌ ఇరు కుటుంబాలు ఇచ్చిన తాజా సంకేతాలు అభిమానుల్లో కొత్త ఆశను నింపుతున్నాయి.

నవంబర్ 23న జరగాల్సిన స్మృతి, పలాశ్‌ల‌ పెళ్లి వేడుక చివరి క్షణాల్లోనే వాయిదా పడటం అందరిని ఆశ్చర్యపరిచింది. వివాహ దినాన స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో అస్వస్థతకు గురికావడం, వెంటనే ఆసుపత్రిలో చేరవలసి రావడం.. ఈ పరిస్థితుల్లో పెళ్లి జరగటం అసాధ్యం కావడంతో నిరవధిక వాయిదా ప్రకటించాల్సి వచ్చింది. కుటుంబానికి ఇది ఆ రోజు అతి పెద్ద షాక్.

అయితే ఇక్కడితో కథ ముగియలేదు. ఆ వెంట‌నే వరుడు పలాశ్ ముచ్చల్ కూడా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం మరో ఆందోళన కలిగించింది. ఒత్తిడి, యాంగ్జైటీ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ థెరపీతో పాటు పూర్తి విశ్రాంతి అవసరమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో స్మృతిని కించపరిస్తూ పలాశ్ మరో మహిళతో చాట్ చేసిన‌ స్క్రీన్‌షాట్లు వైరల్ అవ్వడం, స్మృతి తన పెళ్లి ఫోటోల్ని డిలీట్ చేయడం.. వివాహం రద్దయిందనే పుకార్లకు బలం చేకూర్చింది.

అయితే తాజాగా రూమర్ల‌కు పలాశ్ తల్లి అమిత ముచ్చల్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, “స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. పలాశ్ తన కలలను సాకారం చేసుకొని, స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కోరుకున్నాడు. వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు నేను కూడా ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడంతా బాగానే ఉంది… పరిస్థితులు సద్దుమణిగాయి. స్మృతి–పలాశ్ వివాహం అతి త్వరలోనే జరుగుతుంది” అని స్పష్టతనిచ్చారు. స్మృతి వైపు నుంచి అధికారిక ప్రకటన రాలేనప్పటికీ, ఇరు కుటుంబాల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు పెళ్లి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు సూచిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌:...

నేనింకా ముసలోడిని కాలేదురా..

నేనింకా ముసలోడిని కాలేదురా.. గిల్, సిరాజ్‌తో రోహిత్ శర్మ! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: భారత్...

చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ..

చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ.. గంగూలీ రికార్డ్ బద్దలు! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా...

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్..

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్.. కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : పొట్టి...

అష్లీ గార్డ్​నర్ మెరుపులు

అష్లీ గార్డ్​నర్ మెరుపులు గుజరాత్​ గ్రాండ్ విక్టరీ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : 2026...

ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్‌

ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్‌ కాకతీయ‌, స్పోర్ట్స్ డెస్క్ :...

మాట తప్పని ‘లిటిల్ మాస్టర్’

మాట తప్పని 'లిటిల్ మాస్టర్' జెమీమా కోసం గవాస్కర్ స్పెషల్ సర్ప్రైజ్! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

చరిత్ర సృష్టించిన హర్మన్​ప్రీత్‌

చరిత్ర సృష్టించిన హర్మన్​ప్రీత్‌ తొలి మ్యాచ్​లో రికార్డులే రికార్డులు కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img