- పేద విద్యార్థులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
కాకతీయ, పరకాల : పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, పీజీ కళాశాల యజమాన్యాలతో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ సోమవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఎస్ఎఫ్ఐ తెలంగాణ కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ బంద్ లో విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


