epaper
Thursday, January 15, 2026
epaper

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం !
ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ?
అత్యంత వివాదాస్ప‌దంగా మారిన ఓ న్యూస్ ఛాన‌న్ క‌థ‌నం
ఆయుధంగా వాడుకున్న బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా
ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారం
తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ అధికారుల అసోసియేషన్
మహిళా అధికారిపై తప్పుడు కథనం స‌రికాదంటూ ఫైర్‌
తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి క్లిప్పింగ్స్ తొలగించాల‌ని డిమాండ్‌
స‌ద‌రు మీడియాపై న్యాయపరమైన చర్యల‌కు వెనుకాడబోమని హెచ్చ‌రిక‌
ఇప్ప‌టికే ఇదే అంశంపై ఘాటుగా స్పందించిన మంత్రి కోమ‌టిరెడ్డి..
మ‌హిళా అధికారుల‌ను వివాదాల్లోకి లాగొద్దంటూ పీసీసీ ఛీఫ్ అభ్య‌ర్థ‌న‌
తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మీడియా క‌థ‌నం

కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారిపై వస్తున్న తప్పుడు కథనాలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో సదరు మీడియా హౌజ్‌పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజకీయ కుట్రల్లో భాగమై మహిళా ఐఏఎస్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఎన్టీవీపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తోంది. ఈమేర‌కు ఎన్టీవీ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఘాటైన లేఖను ఐఏఎస్ అధికారుల సంఘం విడుదల చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్ప‌టికే ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ తీవ్రంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ ఛీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సైతం స‌ద‌రు న్యూస్ చాన‌ల్ క‌థ‌నాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆ ఇద్ద‌రి మ‌ధ్య వివాహేతర బంధం అంటూ క‌థ‌నం

తెలంగాణకు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా, సదరు అధికారిణికి, ఒక మంత్రికి మధ్య వివాహేతర బంధం నడుస్తోందంటూ ఎన్టీవీ కథనం ప్రసారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కథనం క్లిప్పింగులతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారాలు చేయ‌డం క‌ల‌క‌లంరేపుతోంది. ఇది మహిళా అధికారి వ్యక్తిత్వంపైనే దాడి కావడంతో ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో లేదా టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఒక బాధ్యతాయుతమైన అధికారి పరువుకు భంగం కలిగించడం క్షమించరాని నేరమని సంఘం పేర్కొంది.

ఆరోపణలు పూర్తిగా అవాస్తవం

సదరు మహిళా అధికారికి మంత్రి ప్రత్యేక పోస్టింగ్‌లు ఇప్పించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇవి కేవలం పరిపాలనాపరమైన బదిలీలను రాజకీయం చేసే ప్రయత్నమని లేఖలో స్పష్టం చేశారు. మీడియాకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం నైతికత లేని జర్నలిజానికి నిదర్శనమని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, సమాజంలో వారి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది. వెంటనే సదరు తప్పుడు కథనాన్ని అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని మ, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఈ విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ సంఘం డిమాండ్ చేసింది. ఒకవేళ స్పందించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సమాచార శాఖకు కూడా ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ బాధాకరం

తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ … వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు. వాస్తవానికి దూరంగా కథనాలు వస్తున్నాయని ఆగ్రహించారు. ఎంతో కష్టపడితే తప్ప మంత్రులు ఈ స్థాయికి చేరుకోరని.. అలాంటి వారిపై మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రచురించడం మానేయాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

మేడారం జాత‌ర‌లో నా జోక్యంలేదు

మేడారం జాత‌ర‌లో నా జోక్యంలేదు పనులన్నీ సీతక్క, పొంగులేటి చూస్తున్నారు నేను నా శాఖ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img