దిశ మార్చుకున్ తుఫాను
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
ఖమ్మం జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించిన మంత్రి తుమ్మల
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మెంథా తుఫాను తీరం దాటడంతో పాటు దిశ మార్చుకోవడంతో తెలంగాణపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో – ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రైతులు తమ పంటలను వర్షాల భారీనుండి కాపాడుకోవాలని, తొందరపడి పంటలను అమ్ముకోవొద్దని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను వాగులు వంకలు దాటకుండా చూడాలని, అందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు.


