ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు..
అర్చకులు సురేంద్ర శర్మ కన్నుమూత
కాకతీయ, కారేపల్లి : శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు వలివేటి సురేంద్ర శర్మ మరణంతో ప్రాంతంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆదివారం పరమపదించారు. దశాబ్దాలుగా ఆలయ సేవలో నిమగ్నమైన సురేంద్ర శర్మ భక్తి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆలయాన్ని పునీతం చేశారు. భక్తులకు దైవ మార్గదర్శిగా నిలిచారు.
పర్వదినాలు, ఉత్సవాల్లో ఆయన నిర్వహించిన పూజలు భక్తులను ఆకట్టుకునేవి. భక్తుల సమస్యలకు పరిహారాలు చెబుతూ దైవచింతన పెంపొందించారు.
ఆయన మరణం భక్తులకు తీరని లోటుగా మారింది. ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించే ఆ రూపం ఇక కనిపించదని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సురేంద్ర శర్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


