epaper
Sunday, March 1, 2026
epaper

మోగిన పంచాయతీ నగారా

మోగిన పంచాయతీ నగారా

గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్

31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నిక‌లు

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌.. కౌంటింగ్‌

రాష్ట్రంలో మొత్తం 12,728 సర్పంచ్‌..
1,12,242 వార్డు స్థానాలు

ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్లు

ఈనెల 25 నుంచే అమ‌ల్లోకి కోడ్‌

తెలంగాణ‌లో కోటి 66 లక్షలకుపైగా ఓటర్లు

వివ‌రాలు వెల్ల‌డించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని

ప‌ల్లెల్లో పండుగ వాతావర‌ణం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప‌ల్లె పోరుకు రంగం సిద్ధ‌మైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖ‌రారైంది. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌కు ఎట్ట‌కేల‌కు న‌గ‌రా మోగింది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మంగ‌ళ‌వారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈమేర‌కు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని వివ‌రాలు వెల్ల‌డించారు. మొత్తం మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లోని 12,728 సర్పంచ్‌ స్థానాలు, 1,12,242 వార్డుల‌కు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్.. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఎల్లుండి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. నిన్న‌టి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని రాణి కుమిదిని తెలిపారు. కాగా.. రిజ‌ర్వేష‌న్లు ఖ‌రార‌వ‌డంతోపాటు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌వ‌డంతో తెలంగాణ పల్లెల్లో పండుగ వాతావర‌ణం క‌నిపిస్తోంది. పార్టీ గుర్తుల‌పై జ‌ర‌గ‌క‌పోయినా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి.

ముఖ్య తేదీలు ఇవే..

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 12,728 సర్పంచ్‌, 1,12,242 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్.. పోలింగ్‌ రోజే మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు.
రేప‌టి నుంచి తొలి విడత నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈనెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. తొలి విడతలో 4,236 సర్పంచ్‌ స్థానాలకు 37,440 వార్డులకు పోలింగ్ జ‌ర‌గనుంది. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలకు 38,350 వార్డులకు, మూడో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలకు 38,350 వార్డులకు పోలింగ్ చేప‌ట్ట‌నున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాయి.

ప్రభుత్వ తీరుపై మండిపాటు..

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీలు కూనరిల్లుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో మసక బారుతున్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజల అవసరాలు తీర్చే వారు కరువయ్యారు. ఈ పరిస్థితిలో సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్‌ ప్రభుత్వం ఈమేరకు ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించే అంశంలో కాంగ్రెస్‌ సర్కారు పూటకో రాజకీయానికి పాల్పడింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపిన బీసీ రిజర్వేషన్‌ అంశాన్ని చట్టబద్ధంగా మార్చడానికి రేవంత్‌ ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఈ అంశం కాస్తా హైకోర్టు మెట్లు ఎక్కడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించలేక చేతులు ఎత్తేయడంతో ఎన్నికలు మధ్యంతరంగా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

గ‌తంలో హైకోర్టు బ్రేక్‌

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాకపోవడంతో పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. కానీ హైకోర్టు కొట్టివేయడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడింది. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ కోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు వృధా కాకుండా పోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి నెల‌కొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్.. సర్పంచ్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తుందా ? రిజర్వేషన్ల అంశంపై విపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలను ఫలితాల ద్వారా అధిగమిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img