కాకతీయ, నేషనల్ డెస్క్: యూపీలోని ఓ పోలీస్ స్టేషన్ లో క్రిష్ణాష్టమి వేడుకల్లో అశ్లీల న్రుత్యాలు ప్రదర్శించారు. సినిమా పాటలకు యువతులు డ్యాన్స్ చేస్తుండగా..పోలీసులు కూడా అలాగే చూస్తున్నారు. ఆ ద్రుశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో 9 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు.
జౌన్ పూర్ జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ లో క్రిష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్లీల న్రుత్యాలు ప్రదర్శించారు. యువతుల న్రుత్యాలు, పోలీస్ స్టేషన్ లోగో ఉన్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ కౌస్తుబ్, బదలాపూర్ ఎస్ హెచ్ఓ అర్వింద్ కుమార్ పాండేను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును రూరల్ ఎస్పీకి అప్పగించారు. అయితే దర్యాప్తు రిపోర్టులో ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లతో సహా మరో 6గురు పోలీసులు తప్పు చేసినట్లుగా తేలింది. దీంతో మొత్తం తొమ్మిది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని.. దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ అతీశ్ కుమార్ తెలిపారు. క్రిష్ణాష్టమి రోజు బదలాపూర్ లో నిర్వహించిన సాంస్క్రతిక కార్యక్రమంలో అశ్లీల డ్యాన్సులు ప్రదర్శించారు. ఎస్పీ వెంటనే చర్య తీసుకుని ఎస్ హెచ్ఓను సస్పెండ్ చేశారు. ఆగస్టు 16న వైరల్ అయిన ఈ వీడియోపై దర్యాప్తు చేపట్టారు. అందులో 9 మంది దోషులుగా తేలారు. వారిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా మరింతగా తప్పు చేసినట్లు తేలితే..వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అతీశ్ కుమార్ పేర్కొన్నారు.


