జన వికాస సంస్థ సేవలు మరువలేనివి
మరిపెడ జీపీ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్
కాకతీయ, మరిపెడ : అనాథలకు, పేదలకు జన వికాస సంస్థ చేస్తున్న సేవలు మరువలేనివని, వారి సేవలు వర్ణనాతీతమని మరిపెడ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్ ప్రశంసించారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని బాలవికాస సంస్థ కార్యాలయంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేస్తూ జన వికాస సంస్థ సమాజానికి అండగా నిలుస్తోందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని గ్రామాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విద్యకు అండగా జన వికాస
అనాధ పిల్లల విద్యాసంస్థల ఖర్చులను సంస్థే భరిస్తుండటం హర్షణీయమని పేర్కొన్నారు. ఇది నిజంగా ఆదర్శవంతమైన చర్యగా నిలుస్తోందని, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా జన వికాసాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అమూల్య, గంధసిరి, ఉపేంద్ర, సుకన్య, శోభ, రామ తదితరులు పాల్గొన్నారు.


