భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్`.. ఆ రెడ్ ప్లాంట్ అర్థమదేనా..?
హైదరాబాద్ హౌస్ లో పుతిన్-మోదీ సమావేశం
దేశాధినేతల మధ్య స్పెషల్ అట్రాక్షన్‌గా రెడ్ ప్లాంట్
హెలికోనియా ద్వారా శక్తివంతమైన సంకేతం
కాకతీయ, నేషనల్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా రెండవ రోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్‌లో దేశాధినేతల మోదీ, పుతిన్ మధ్య ఒక రెడ్ ప్లాంట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దాని పేరు హెలికోనియా. అలంకారం కోసమే కాదు.. హెలికోనియా మొక్క ద్వారా భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్` ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హెలికోనియా, మధ్య మరియు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన ఒక ఉష్ణమండల పుష్పమొక్క. దాని పువ్వులు రంగురంగులుగా, ఆకులు ఆకట్టుకునే పచ్చగా ఉండటం వలన దీన్ని కట్ ఫ్లవర్, ఇంటీరియర్ అలంకారం, పెరేడ్ లేదా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ఈసారి పుతిన్-మోదీ సమావేశంలో ఇది ఒక సాంఘీక-రాజనీతిక సంకేతంగా ఉపయోగించబడింది.
సాంస్కృతికంగా, హెలికోనియా సానుకూల శక్తికి సూచిక. ఇది వృద్ధి, శ్రేయస్సు, సామరస్యాన్ని సూచిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త ఆరంభాలు, ముందడుగు, శుభప్రవాహం కోసం దీన్ని ప్రత్యేకంగా చూడవచ్చని భావిస్తారు. అయితే పుతిన్-మోదీ భేటీలో మధ్యలో ఈ రెడ్ ప్లాంట్‌ను ఉంచడం ద్వారా, ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహం, భరోసా, మరియు సానుకూల సంబంధంని ప్రతీకాత్మకంగా చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు.
పుతిన్..భారత్ కు చాలా కావాల్సిన మనిషి. ప్రధాని మోదీకి మంచి స్నేహితుడు. దాంతో పాటూ భారత్, రష్యాల మధ్య స్నేహం చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. కానీ, అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ భారత్ రాక, ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒక పెద్ద ఇంపాక్ట్ కలిగించింది. ఈ సందర్భంలో, హెలికోనియా వంటి చిన్న అలంకార మొక్క భారత్-రష్యా బంధానికి శక్తివంతమైన, స్పష్టమైన సందేశంను అందించింది. దీంతో సోషల్ మీడియా ఈ ప్రత్యేక హెలికోనియా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


