- రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు..
కాకతీయ, హైదరాబాద్ సిటీ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అంబర్‌పేట కార్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని అన్నారు. రాచకొండ పరిధిలో తీవ్రవాదుల చేతిలో అమరులైన 16 మంది పోలీసు సిబ్బందుల కుటుంబ సభ్యులను సత్కరించి, వారి కుటుంబాలకు మేము అండగా ఉన్నామని కమిషనర్ తెలిపారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ విమెన్ సేఫ్టీ ఉషారాణి, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-1 శ్రీనివాస్, ట్రాఫిక్-2 శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, హెడ్‌క్వార్టర్ డీసీపీ శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు.


