వీర బాలుల త్యాగం తరతరాలకు స్ఫూర్తి
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ :పదవ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన సాహిబ్ జాదా జోరావర్ సింగ్, సాహిబ్ జాదా ఫతే సింగ్‌ల అసాధారణ ధైర్యం, వీరోచిత త్యాగం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వీర బాలుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే వీర్ బాల్ దివస్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాలనుసరించి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీర్ బాల్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్దార్ బల్వీర్ సింగ్ నేతృత్వంలో కరీంనగర్ టవర్ సర్కిల్ నుంచి సిక్కువాడలోని గురుద్వారా వరకు నగర కీర్తన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర బాలుల త్యాగాన్ని గౌరవిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022లో డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్గా అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. పిల్లల త్యాగాలను గౌరవించేందుకు అంకితమైన తొలి జాతీయ దినోత్సవం ఇదేనని పేర్కొన్నారు. నేటి తరంలో ధైర్యం, నిబద్ధత, దేశభక్తిని పెంపొందించడమే వీర్ బాల్ దివస్ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ గురుద్వారా అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, కార్యదర్శి సర్దార్ యస్పాల్ సింగ్, కమిటీ సభ్యులు రవీందర్ పాల్ సింగ్, మంజిత్ సింగ్, జస్పాల్ సింగ్, రణధీర్ సింగ్, సురేందర్ పాల్ సింగ్, స్వరణ్ సింగ్, భూపేందర్ సింగ్‌లతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, సాయినీ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సమీ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.


