హర్వెస్టర్ వెనుక వైపు నుండి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.
హార్వెస్టర్‌ను ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.
ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాష్ట్ర రహదారి నెం.1 (SH-1) పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిరియల్ డిపోకు చెందిన టీఏస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (టీఏస్ 19జడ్ 0031) హార్వెస్టర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగ మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలిసుల కథనం మేరకు బుదవారం రాత్రి 11:10 గంటల సమయంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును డ్రైవర్ లక్సెట్టి బుచ్చిరాములు అధిక వేగంతో నిర్లక్ష్యంగా నడపడతంతో అదే దారిలో వెళ్తున్న హార్వెస్టర్‌ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హార్వెస్టర్‌లో హెల్పర్గా పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం గురాల గ్రామానికి చెందిన గురాల సాగర్ (28) అక్కడికక్కడే మృతి చెందాగ హార్వెస్టర్ డ్రైవర్ గుండ్రాతి సంతోష్ (32) తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ సంతోష్ ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుసిన సమాచారం.


