కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం
ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తూ అండగా నిలుస్తున్నారు
ఖానాపురం ఎస్ఐ రఘుపతి
కాకతీయ, ఖానాపురం: మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉద్యోగ సంఘం ప్రతినిధుల పాత్ర అభినందనీయమని ఖానాపురం ఎస్ఐ రఘుపతి అన్నారు. ఇటీవల గ్రామంలో మరణించిన జాటోత్ సోమ్లి మరణించగా వారి కుటుంబానికి ఉద్యోగ సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో సేకరించిన 50 కేజీల బియ్యాన్ని ఎస్.ఐ తో కలిసి సంఘ ప్రతినిధులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన భూక్య జగన్ సతీమణి సరిత అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా వారి కుటుంబానికి రూ.11 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ పుత్తూరు గ్రామంలో ఒక సంఘం ప్రతినిధులుగా ఏర్పడి తండాలో ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వారికి నిలబడుతున్న సంఘం ప్రతినిధిలో కృషి అభినందనీయమని అన్నారు ఇలాగే భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఎస్ఐ ని శాలువాతో సత్కరించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు జాటోత్ ఫకీర సంఘ ప్రతినిధులు జీవన్, శ్రీను, వీర్య, స్వామి, భాస్కర్, వినోద్, జమ్మూలాల్, కిషన్ లాల్, సార్లు తదితరులు పాల్గొన్నారు.



