ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
*ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం గీసుగొండ మండలం మరియపురం గ్రామంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించను న్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద బుధవారం జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ ప్రాంగణం,పార్కింగ్, తాగునీరు,కూర్చోవడానికి ఏర్పాట్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు,ముఖ్య ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.జిల్లాలోని సర్పంచులు,మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.సంబంధిత ప్రజా ప్రతినిధులు,అధికారులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి,వైవి గణేష్, సీఈఓ రాంరెడ్డి,డిపిఓ కటకం కల్పన,సాంబశివ రావు, తహసిల్దార్లు ఎండి రియాజుద్దీన్, రాజ్ కుమార్,డిఎల్పిఓ రాజీవ్ కుమార్,ఎంపీడీఓలు వి.కృష్ణవేణి, అరుంధతి,శ్రీనివాస్ రావు, కిషన్, శంకర్,ఎంపీఓ పాక శ్రీనివాసులు, శేషంజన్ స్వామి, శ్రీధర్,ప్రకాష్, రవి,ఏపిఓ చంద్రకాంత్,ఆర్ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


