- సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
- నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సోమవారం రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిమంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం కళకళలాడిందన్నారు. గత పదేళ్లలో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోలు చేపడుతున్నామని తెలిపారు. కిసాన్ యాప్ నిర్ధారించిన సమయం తేదికి పత్తిని తీసుకొని పోవాలన్నారు. సీసీఐకి అమ్మితే వారం లోపు రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. అనంతరం వరంగల్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కార్పొరేటర్లు కావేటి కవిత, సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


