టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి
జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్
కాకతీయ, కొత్తగూడెం : కారుణ్య నియమకాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్
ఆదేశించారు. శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి ఆయన అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు, సిఎంపిఎఫ్, సిపిఆర్‌ఎంఎస్ యొక్క జీవన్ ప్రమాన్(డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్)రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా క్వార్టర్ కౌన్సిలింగ్, ఓఎస్‌ఎల్, సిపిఆర్‌ఎంఎస్ కార్డుల యొక్క రిపోర్టులను నిర్ణీత గడువులోగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి గ్రాట్యుటీ చెల్లింపులకి సంబందించి ఏఎల్‌సి(సి)కి లెటర్లను పంపించాలని సూచించారు. సిపిఆర్‌ఎంఎస్ కార్డులను జారీచేసే ముందు ఉద్యోగి వారి కుటుంబ సభ్యుల వివరాలను చెల్లించిన మొత్తం రుసుమును సరిచూసుకోవాలని తెలిపారు. కారుణ్య నియమకాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు డిజిఎం(పర్సనల్)లు కేసా నారాయణరావు, బి.శివ కేశవ రావు, ముకుంద సత్యనారాయణ, కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.


