epaper
Friday, March 13, 2026
epaper

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి
మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ
మున్నూరుకాపు ఉద్యోగులు–విశ్రాంత ఉద్యోగుల 2026 డైరీ ఆవిష్కరణ
సంఘటితంగా ముందుకు సాగాలి : వక్తల పిలుపు

కాకతీయ, ఖమ్మం : మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని రంగాల్లో తమ సత్తాను చాటుతూ సంఘటితంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట సమీపంలోని పీవీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ డైరీని ఖమ్మం మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్.జె.సి కృష్ణ, మున్నూరుకాపు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు *డాక్టర్ బాల శ్రీనివాస్*తో పాటు ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మున్నూరుకాపు కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో మున్నూరుకాపులు తమ ప్రభావాన్ని అన్ని రంగాల్లో స్పష్టంగా చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంఘటిత శక్తిగా ఎదగాలి

సంఘటితంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని, ఉద్యోగులు–విశ్రాంత ఉద్యోగులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వక్తలు సూచించారు. సమాజాభివృద్ధితో పాటు యువతకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా మున్నూరుకాపు పెద్దలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల భారీ సంఖ్యలో పాల్గొని సంఘ కార్యకలాపాలకు మద్దతు తెలిపారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెద్ద బోయిన నాగరాజు, కర్నాటి సోమయ్య, నిర్మల సూరిబాబు, మేకల బిక్ష్మయ్య, ఏనుగుల రాజు పటేల్, సత్యనారాయణ పటేల్, పసుపులేటి శ్రీనివాస్, పగడాల రాంప్రసాద్, రాకం శ్యామ్ బాబు, శారద రంగ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 2026 డైరీని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు విశేషంగా ఆదరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img