కవి అందె శ్రీ కన్నుమూత
కాకతీయ, హైదరాబాద్ : వాగ్గేయకారుడు, కవి అందె శ్రీ కన్నుమూత ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ను రచించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ వంటి అనేక ప్రసిద్ధ పాటలు, కవితలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించారు. ఆయన సాహిత్యానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ, సాహిత్య ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


