- స్వార్థపూరిత రాజకీయం కోసం మళ్లీ ముస్లింల మద్దతుకు ప్రయత్నం
- కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అజీమ్ విమర్శలు
కాకతీయ, కరీంనగర్ : మైనార్టీలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ మండిపడ్డారు. శనివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో నిజామాబాద్ సభలో కవిత ముస్లింలను పక్షులతో పోల్చి, ‘ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే’ అంటూ చేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఆమె క్షమాపణ చెప్పడానికి సైతం నిరాకరించారని అన్నారు. ఇప్పుడు మాత్రం మైనారిటీల మద్దతూ కోరుతుండటం.. ఆమె స్వార్థ రాజకీయానికి, ద్వంద వైఖరులకు నిదర్శనమని అన్నారు.


