కాకతీయ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ నిత్యం సమస్యలతో వచ్చే వందల మంది నగర ప్రజలు మరియు ఆఫీసు ఉద్యోగులతో కిటకిటలాడుతుంది. ఇంతటి రద్దీ ఉండే ఆఫీస్ ప్రదేశం ఎంతో పరిశుభ్రంగా మరియు ప్రజలకు అధికారులకు సౌకర్యకరంగా ఉండాల్సింది పోయి నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తుంది.
గతవారం మున్సిపల్ ఆఫీస్ రూముల్లో పైకప్పు పెచ్చులు ఊడి కింద పడిన ఘటన మరవక ముందే మళ్లీ కరెంటు కష్టాలతో ఏకంగా మున్సిపల్ అధికారులే ఆఫీసు గోడలపై అతికించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నగర ప్రజల సమస్యలు తీర్చాల్సిన ఆఫీసే సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఇక మా ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారని నగర ప్రజలు నివ్వెర పోతున్నారు. దానికి నిదర్శనమే అధికారులు మున్సిపల్ ఆఫీసులోని గోడలకు నన్ను ముట్టుకోకు కరెంట్ షా కొడతా అని పేపర్ మీద రాసి అతికించారు. వారి ఆఫీస్ కష్టాలే తీర్చుకోలేకపోతున్న అధికారులు మా ప్రజల కష్టాలు ఎలా తీరుస్తారని వాపోతున్నారు.


