కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సందడి
కాకతీయ, చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం నుండి కొమ్మాల జాతరకు తరలివెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రభ బండ్ల ర్యాలీ ఘనంగా, భారీ స్థాయిలో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వందల సంఖ్యలో ప్రభ బండ్లతో ర్యాలీగా బయలుదేరి జాతరకు కదిలారు. గ్రామాల్లో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. డప్పుల మోగింపు, జై బీఆర్‌ఎస్ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభ బండ్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, పార్టీ జెండాలతో అలంకరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గటిక అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెన్నారావుపేట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న, మాజీ ఎంపీపీ జక్క అశోక్, నెక్కొండ మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివ కుమార్ తదితరులు ర్యాలీకి తోడయ్యారు. అలాగే నాయకులు బొల్లెబోయిన విరస్వామి, అప్పలరావుపేట మాజీ సర్పంచ్ వడ్డే సురేష్, మాతంగి రాజు సహా పలువురు నాయకులు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, యువజన శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరకు తరలివెళ్లారు.


