కాకతీయ, నల్లబెల్లి: ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడక వినయ్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం నల్లబెల్లిలోని పార్టీ కార్యాలయంలో, బీజేపీ రాష్ట్ర జిల్లా శాఖ సూచనలతో నిర్వహించిన సేవాపక్షం అభియాన్ సమావేశం ఈర్ల నాగరాజు అధ్యక్షత జరుగగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు (గాంధీ జయంతి వరకు) దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదని ఆరోపించారు.
కార్యక్రమంలో నాయకులు పెరుమాండ్ల కోటి వల్లే పర్వతాలు, గుర్రపు నరేష్, మర్రి నాగరాజు, మురికి మనోహర్ రావు, తిప్పారపు శివ, నాగిరెడ్డి, రాజిరెడ్డి, ములుక రాజేష్, గుగులోతు రాందాస్, నాగపురి సాగర్, ఓదెల అశోక్, దేవేందర్, అనిల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


