పల్లె పల్లెన ముదిరాజ్ జెండా ఎగరాలి…
వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్
కాకతీయ,రాయపర్తి : నవంబర్ 21నాడు పల్లె పల్లెన ముదిరాజ్ జెండా ఎగరావేయాలని వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ అన్నారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు,ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కులస్తులతో కలిసి రాయపర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాడు పల్లె పల్లెన ముదిరాజ్ జెండాను ఎగురవేయాలన్నారు.బీసీ డి కేటగిరిలో ఉన్న ముదిరాజులను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు,చేనేత కార్మికులకు ఇచ్చినట్లుగానే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డకు పింఛన్ ఇవ్వాలని కోరారు.3000 కోట్లు కేటాయించి తెలంగాణ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షుడు కనుకుట్ల యాకయ్య, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మీనారాయణ,కార్యదర్శి చెవ్వు యాకయ్య,ముద్రబోయిన నరేష్,ఊగ ప్రభాకర్,బండారి అశోక్,దినేష్,శ్రీకాంత్,యాకన్న,విష్ణు తదితరులు పాల్గొన్నారు.


