epaper
Sunday, March 1, 2026
epaper

అహనా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నారు

  • కంటోన్మెంట్‌లో ఒక్క హామీ అమ‌లు కాలేదు
  • పేదల‌ను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు
  • జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మొద్దు
  • బీఆర్ఎస్ నేత క్రిషాంక్

కాకతీయ. హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అహనా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నాడ‌ని బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచి, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేస్తున్నార‌ని అని క్రిశాంక్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌న్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, మంత్రులు కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసినట్లు, జూబ్లీహిల్స్ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కంటోన్మెంట్‌కు కేంద్రం నుండి రూ.1000 కోట్లు తెస్తా అన్నాడు.. ఒక్క కోటి అయినా తెచ్చాడా? ఎలివేటెడ్ కారిడార్ కోసం ఆర్మీ వాళ్లు వాళ్ల భూములు ఇస్తే ప్రభుత్వం దానికి పరిహారం కింద డబ్బులు ఇచ్చింది. అవి కంటోన్మెంట్ భూములకు వచ్చిన డబ్బులు.. ఆ డబ్బులను కూడా నిధులు తెచ్చాం అని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. 2022లో బండి సంజయ్ కంటోన్మెంట్‌కు రూ.700 కోట్లు తెస్తానని అన్నాడు.. 7 రూపాయలు కూడా తేలేదు అని మన్నె క్రిశాంక్ విమ‌ర్శించారు.

ఒక్క హామీ అమ‌లుకాలే..

రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ పట్టా అన్నా ఇచ్చారా.. మీరు ఇచ్చాము అంటేనే జుబ్లీహిల్స్‌లో ఓటు అడగండి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి చెప్పారు.. 6 ఇళ్లు కూడా ఇవ్వలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 23 కోట్లు శాంక్షన్ అయిందని మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెప్పాడు. కానీ అక్కడ మాత్రం ల్యాండ్ ఖాళీగా ఉంది.. గ‌తంలో కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోళ్ల‌ను చేశారు. సంవత్సరం నుండి కంటోన్మెంట్‌కు ఏమీ రాలేదు కానీ.. మా ఎమ్మెల్యేకి మాత్రం బెంజ్ కార్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు మా కంటోన్మెంట్ ప్రజలకు వచ్చింది ఇది అని కోడిని చూపించారు మన్నె క్రిశాంక్. మాగంటి గోపీనాధ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఆయ‌న సతీమణి
సునీత గెలవాలని జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు.. అని క్రిషాంక్ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img