epaper
Monday, March 2, 2026
epaper

మేయర్ పీఠం బీజేపీ దే

మేయర్ పీఠం బీజేపీ దే
కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం
సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు
పైరవీలు, గొడవలు చేస్తే షోకాజ్ తప్పదు
టికెట్ల పేరుతో మోసాలకు తావు లేదు
రాంగ్ స్టెప్ వేస్తే రాజకీయ భవిష్యత్తే ప్రమాదం
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు
బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి.. బెంగాల్ తర్వాత లక్ష్యం తెలంగాణే
కేంద్ర హోం స‌హ‌య‌శాఖ మంత్రి బండి సంజ‌య్‌
క‌రీంన‌గ‌ర్‌లో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లోని త్రిధా హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పట్టణ జోన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ మాట్ల‌డుతూ. టిక్కెట్ల విషయంలో ఈసారి పైరవీలు, ఒత్తిళ్లకు ఎలాంటి చోటు లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మొద్దని పార్టీ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలిచే అవకాశమున్న అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయిస్తామని తనకు గానీ కుటుంబ సభ్యులకు గానీ ఫోన్లు చేస్తే టిక్కెట్లు కూడా దక్కవని కఠిన హెచ్చరిక చేశారు. టిక్కెట్లు రాలేదని ఆవేశంతో పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. టిక్కెట్లు దక్కకపోయినా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల ద్వారా పూర్తి న్యాయం చేస్తామని ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కేలా కృషి చేస్తానని ప్రకటించారు. వ్యక్తిగత ఆశలకన్నా పార్టీ విజయం ముఖ్యమని క్రమశిక్షణతో పనిచేస్తేనే రాజకీయంగా ఎదుగుదల సాధ్యమవుతుందన్న స్పష్టమైన సంకేతాలను బండి సంజయ్ ఇచ్చారు.

రాంగ్ స్టెప్ వేస్తే షోకాజ్
కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే

టిక్కెట్లు రాలేదనే ఆవేశంతో పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తే నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అలాంటి వారిపై వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. బ్లాక్ మెయిల్‌, బెదిరింపులకు తాను లొంగే రకం కాదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ చేసిందేమీ లేదని బండి సంజయ్ మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతోందని స్పష్టం చేస్తూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బోగస్ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించారు. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను సేకరించి ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలన్నారు. బోగస్ ఓట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బెంగాల్ తర్వాత లక్ష్యం తెలంగాణే

బెంగాల్, తమిళనాడు ఎన్నికల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి మొత్తం తెలంగాణపైనే కేంద్రీకృతం కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తూ తెలంగాణలో పార్టీ గెలుపుతోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యం సంపూర్ణమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాలు, నిరంతర పోరాటాల ఫలితంగానే కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన కేరళలోనూ, రాజకీయంగా క్లిష్టమైన బెంగాల్‌లోనూ పార్టీ బలంగా నిలబడిందని బండి సంజయ్ తెలిపారు. బెదిరింపులు, అణచివేతలు ఎదురైనా కార్యకర్తలు వెనకడుగు వేయలేదని అదే పోరాట పటిమ తెలంగాణలోనూ బీజేపీ విజయానికి బాట వేస్తుందని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img