epaper
Wednesday, March 25, 2026
epaper

ములుగులో నకిలీ పత్రాల మాయజాలం

ములుగులో నకిలీ పత్రాల మాయజాలం
ఒకే ఆస్తిపై ముగ్గురి పేర్లు..
రూ.15 లక్షల లోన్ వ్యవహారంలో సంచలనం
తప్పుడు పత్రాలతో రికార్డుల సృష్టి
ఆర్టీఐతో బయటపడిన అసలు నిజాలు
వివ‌రాలు వెల్ల‌డించిన తోటకూరీ శ్రీకాంత్

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో నకిలీ పత్రాలు, తప్పుడు రికార్డులతో భారీ మోసం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఆస్తిపై మూడు పేర్లు చుట్టుముట్టడం, అదే పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి రూ.15 లక్షల లోన్ పొందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీఐ పిర్యాదుదారు తోటకూరీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం, ములుగు పట్టణంలోని ఇంటి నం. 2-134కి సంబంధించిన రికార్డులు ఒకరి పేరుతో ఉండగా, యాజమాన్యం మాత్రం మరో వ్యక్తి పేరుతో నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఆస్తికి మూడు పేర్లు ఎలా వచ్చాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కమిషనర్‌తో విచారణ చేపట్టించారు. ఆ విచారణలో ధ్రువీకరణ పత్రం నకిలీ అని తేలినప్పటికీ, తప్పుడు పత్రాలు జారీ చేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంత పెద్ద అక్రమం బయటపడినా అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గిఫ్ట్ డీడ్, లోన్ వ్యవహారం మిస్టరీ

అదే ఆస్తిపై గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ జరగడం, ఆ పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి లోన్ మంజూరు కావడం ఈ కేసుకు మరింత మలుపు తీసుకొచ్చింది. బ్యాంకు రికార్డుల్లో 2008 నుంచే పాజెషన్ ఉన్నట్లు చూపించడం అనుమానాలను మరింత పెంచుతోంది. అయితే, ఆ సమయంలో సంబంధిత వ్యక్తి మైనర్‌గా ఉండటం ఈ వ్యవహారంలో కీలక అంశంగా మారింది. పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆస్తి పాజెషన్ చూపించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అలాగే వివాహం జరగకముందే పేరు మార్పులు చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

మృతురాలి పేరుతో రికార్డులు…

ఇంకా విచిత్రమైన అంశం ఏమిటంటే, 2006లో మరణించిన మహిళ పేరుతో 2008లో పత్రాలు రూపొందించి మ్యూటేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రికార్డులు మార్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలు ఎవరు జారీ చేశారు, రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, బ్యాంకు లోన్ ఎలా మంజూరైంది అన్న ప్రశ్నలకు ఇంకా స్పష్టత రాలేదు. పైగా ఆర్‌టీఐ ప్రశ్నలకు “రికార్డులు లేవు” అన్న సమాధానం రావడం అధికారుల వైఖరిపై మరింత అనుమానాలను పెంచుతోంది. ఈ కేసు నకిలీ పత్రాలు, రికార్డు మార్పులు, ఆర్థిక మోసం, అధికారుల నిర్లక్ష్యం కలిసిన పెద్ద ఎత్తున అక్రమాలుగా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదుదారు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌ కాకతీయ,...

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img