epaper
Saturday, November 15, 2025
epaper

కబ్జా కోరల్లో భూదాన్ భూమి..!!

కాకతీయ, నల్లబెల్లి: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ అంతకంతకి పెరిగిపోతుంటే కబ్జాదారుల చూపు మాత్రం సులభంగా భూమిని పొందే మార్గాలపై పడుతుంది. 20 సంవత్సరాలుగా కబ్జాలో చిక్కుకున్న భూదాన్ భూమి సమస్య నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామంలో ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు సమస్యను పరిష్కరించి భూదాన్ భూమిని గ్రామ అభివృద్ధికి వినియోగించే అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రజావాణిలో సమస్యను వివరించగా స్పందించిన జిల్లా కలెక్టర్ నల్లబెల్లి ఎమ్మార్వో కు సూచించారు. విచారణ మొదలుపెట్టిన ఎమ్మార్వో కు భూదాన్ నుండి గతంలో పట్టాలు పొందినట్టు కబ్జాదారులు చెబుతుండడం, భూదాన్ భూమికి పట్టాలు ఎలా పొందారు, ఎవరిచ్చారు అంటూ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తుండటం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

కబ్జాలో 12 ఎకరాల భూధాన్ భూమి:

వరంగల్ జిల్లా నల్ల వెళ్లిమండలం రేలకుంట గ్రామ శివారు . గల. 317,318,319,320,321 సర్వే నెంబర్లలో 12 ఎకరాల భూమి అప్పటి భూస్వామి అయినా నేరేడుపల్లి వాస్తవ్యులైన మండవ విజయ్ కుమార్ పేరుపై ఉండగా వాడకంలో లేని భూమిపై కన్నేసిన ములుగు జిల్లా మమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి చెందిన వ్యాపారి 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషుల సహాయంతో తన పేరు మీదికి పట్టాను పొందేందుకు ప్రయత్నించాడని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన పిదప రేలకుంట గ్రామ ప్రజలు వ్యతిరేకించడంతో సదరు భూమిని అస్తగతం చేసుకునేందుకు ప్రయత్నం విరమించుకున్నట్టు, అదే సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమి యజమాన హక్కుల కోసం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చే సమయాన్ని అదనుగా చూసుకొని రేలకుంట గ్రామానికి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ 12 ఎకరాల భూమిపై తప్పుడు ధ్రువపత్రాలతో భూ యజమాన హక్కులను పొంది తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఈ స్థలంలో సొంత నిర్మాణాలు తోపాటు మతపరమైన నిర్మాణాలను చేపడుతున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కలెక్టర్ వద్దకు కబ్జాల బాగోతం:
రేలకుంట శివారులోని 12 ఎకరాల భూదాన్ భూమిపై గ్రామస్తులందరూ ఆగస్టు 22వ తేదీన నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి కబ్జా లో ఉన్న భూమిపై వేగవంతమైన విచారణ జరిపించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ నర్సంపేట ఆర్డిఓ కి ఫిర్యాదును బదిలీ చేయగా నల్లబెల్లి ఎమ్మార్వో నీ విచారణ చేపట్టమని ఆర్డిఓ ఆదేశించినట్టు తెలుస్తోంది. గతంలో నల్లబెల్లి మండలంలో పనిచేసిన ఎమ్మార్వోలపై ఒత్తిడిల మూలాన గ్రామ ప్రజలు ఇదే భూమిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం తేలకుండానే విచారణ ముగిసిపోయింది అని, ఈసారైనా జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని కబ్జా కోరల నుండి భూదాన్ భూమిని రక్షించి ఊరికి మహిళలు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్, దసరా ఉత్సవాల కోసం, యువకుల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ఇదివరకు పని చేసిన ప్రజాప్రతినిధుల వలన రేలకుంట, నందిగామ గ్రామాలు మండలంలోని అతిపెద్ద గ్రామాలు అయినా ఈ గ్రామాలకు రావలసిన రైతు వేదిక,విద్యుత్ సబ్స్టేషన్లో, హై స్కూల్ భూమిలేని కారణంగా పక్క ఊర్లకు తరలి వెళ్లాయని,ఇప్పటికైనా కలెక్టర్ చెరువుతో రేలకుంట భూములను కబ్జాకోరాల నుండి విడిపించి గ్రామానికి మేలు జరిగేలా చూడాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

విచారణ చేపట్టి ఆర్డిఓ కి నివేదిక పంపించాం:నల్లబెల్లి ఎమ్మార్వో కృష్ణ

నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామంలో కొత్త భూమి కబ్జా జరిగినట్టు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు విచారణ చేపట్టి సంబంధిత నివేదికను ఆర్డిఓకి పంపించడం జరిగింది..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img