కాకతీయ, బయ్యారం : మండల కేంద్రంలో సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు భూక్యా రవి నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న నాయక్ మాట్లాడారు. తెలంగాణ లంబాడీల రిజర్వేషన్ మూలాలను శంకించే విధంగా జరుగుతున్న దుష్ప్రచారాలను అడ్డుకట్ట వేస్తూ, మన రిజర్వేషన్ మనమే పరిరక్షిస్తూ భావితరాలకు అందించేలా ఒక రక్షణ కవచంలా ఏర్పడి ఐక్యత చాటాలని తెలిపారు.
లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాల పురిటి గడ్డ మానుకోటలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ లంబాడీల సింహా గర్జన మహా సభను జయప్రదం చేయాలని కోరారు. లంబాడీల అడ్డ, తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ మన మానుకోట గడ్డ కి రాష్ట్రం నలుమూలల నుండి లంబాడీ బిడ్డలు వేలాదిగా తరలి వచ్చి జాతి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సేవాలాల్ సేన మానుకోట జిల్లా అధ్యక్షుడు గుగులోతు నందులాల్, అనిల్, స్వామి, శ్రీకాంత్, నరేష్, చంటి, సక్రు, మంత్రియా, కళ్యాణ్, రాము, రంగియా, కోట, చరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


