epaper
Monday, March 2, 2026
epaper

కార్మిక భ‌వ‌నం మార్చిలోపు నిర్మించాలి

కార్మిక భ‌వ‌నం మార్చిలోపు నిర్మించాలి
లేదంటే 318 మంది ఫ్లాట్లు కేటాయించాలి
క‌ల్ల‌బొల్లి మాట‌ల‌తో అధికారంలోకి రేవంత్ స‌ర్కారు
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

కాకతీయ, వరంగల్ సిటీ : ఆజంజాహీ మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మార్చి 31లోపు కార్మిక భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆజంజాహీ మిల్లు కార్మిక భవన పునర్నిర్మాణ అంశంపై గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నన్నపనేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో ఆజంజాహీ మిల్లు కార్మికులకు న్యాయం చేస్తామని వరంగల్ పోస్ట్ ఆఫీస్ వద్ద అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కల్ల‌బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల భవనం స్థలంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. అనంతరం మళ్లీ కార్మిక భవనం నిర్మిస్తామని కొండా మురళి చేసిన ప్రకటనకు ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ప్రకటనలు, హామీలే తప్ప కార్మిక భవన నిర్మాణంపై కానీ, కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్ల విషయంలో కానీ స్పష్టమైన ఫలితం కనిపించడం లేదన్నారు.

మార్చి 31లోపు స్ప‌ష్ట‌తివ్వాలి

మార్చి 31లోపు కార్మిక భవనం నిర్మాణం చేపడతారా? లేక నూతన కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో 318 మంది కార్మికులకు ఫ్లాట్లు కేటాయిస్తారా? అన్న విషయంపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించిన నన్నపనేని నరేందర్… మార్చి 31లోపు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షాలు కలిసి తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. అవసరమైతే కార్మికులే చందాలు వేసుకుని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి, కార్మిక భవన నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టే బాధ్యత తనదేనని కార్మికులకు హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ మేయర్ రాజేశ్వరరావు, మాజీ ఎంపీ సీతారామనాయక్, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img