తీరనున్న తాగునీటి కష్టాలు
కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా వాసుల దశాబ్దాల తాగునీటి కల నెరవేరబోతోంది. తండాలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ గారె సహేంద్ర
బిక్షపతి శుక్రవారం నూతనంగా బోరు వేయించారు. కొంతకాలంగా నీటి ఎద్దడి ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడేవారు. నిత్యం తాగునీటి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని వాపోయారు.
ఈ బోరు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయని గిరిజనులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ సరిపడా నీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తండా అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ రమేష్, వార్డు సభ్యులు, కారోబార్ కారుపోతుల రామచంద్రయ్య, కళ్యాణ్ గౌడ్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.


