బాల్యస్నేహానికి జీవం పోసిన మానవత్వం
అమరేందర్ చారి కుటుంబానికి స్నేహితుల చేయూత
1997–98 బ్యాచ్ నుంచి రూ.21 వేల ఆర్థిక సహాయం
కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన బాల్యమిత్రుడు కాసోజు అమరేందర్ చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. 1997–1998 బ్యాచ్‌కు చెందిన బాల్య స్నేహితులు కలిసి రూ.21 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు. జడ్పీహెచ్ఎస్ పెద్దవంగరలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒక్కటై కుటుంబాన్ని పరామర్శించారు. జాటోత్ రమేష్, అబ్బాడి రమేష్ రెడ్డి, సంపత్, స్వామి, లక్ష్మాన్, రాయరాపు రమేష్, లలిత, మేనకా, రాధికా, శ్రీనివాస్, కళ్యాణి, సోమన్న, కొమరమల్లు, రాము, ప్రవీణ్, మహేష్, సతీష్, లింగన్న తదితరులు ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్నేహం అంటే ఇదేనని గ్రామస్తులు అభినందించారు.


